Saturday, March 15, 2025

ఎదురుచూపు

మనసు మాట వినదు
తన మాట విని అలవాటు

తన మనసు తనది కాదు
నా మనసుకు సర్దుబాటు

తను తిరిగి రాకపోదు
మా మనసులు కలువక పోదు

మా తలరాతల దిద్దుబాటు
మా ప్రయాణాలు ఆగిపోదు

విరహ ప్రేమ లోటుబాటు
అసలు ప్రేమ దరికిరాదు

ఆశ లేని రోజు లేదు
తన కౌగిలి కోసం ఎదురు చూపు

No comments:

Post a Comment